- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దక్షిణ కాశీకి పోటెత్తిన భక్తులు
చతుర్దశితో కూడిన అమావాస్య, ఆరుద్ర నక్షత్రం, మాస శివరాత్రి సోమవారం వంటి, శివునికి ఇష్టమైనవన్నీ ఒకే రోజు కలిసి రావడంతో దక్షిణ కాశీ భిక్కనూరు సిద్ధ రామేశ్వరాలయం సోమవారం భక్తుల రద్దీతో కిటకిటలాడింది.

దిశ, భిక్కనూరు : చతుర్దశితో కూడిన అమావాస్య, ఆరుద్ర నక్షత్రం, మాస శివరాత్రి సోమవారం వంటి, శివునికి ఇష్టమైనవన్నీ ఒకే రోజు కలిసి రావడంతో దక్షిణ కాశీ భిక్కనూరు సిద్ధ రామేశ్వరాలయం సోమవారం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. వేకువజామున పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. 100 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ మంచి దినం రోజు, శివున్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తే కోరిన కోర్కెలు నెరవేరడంతో పాటు, అంతా మంచే జరుగుతుందన్న నమ్మకంతో స్థానికులే కాకుండా జిల్లా, రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు ఆలయానికి తరలివచ్చారు.
దైవదర్శనం కోసం ఆలయ ప్రధాన మండపం నుంచి మెట్ల వరకు భక్తులు క్యూలో నిల్చుని స్వామివారిని దర్శించుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు దంపతులు ఆలయ ప్రధాన మండపంలో జరిగిన ప్రత్యేక అభిషేక కార్యక్రమంలో పాల్గొని స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రత్యేక క్యూ లైన్ ల ద్వారా స్వామివారిని దర్శించుకునేందుకు క్యూ కట్టడం కనిపించింది. సాయంత్రం ఆలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు పెద్దఎత్తున జరిగాయి. ఆలయ అర్చకులు కొడకండ్ల రామగిరి శర్మ ప్రధాన మండపంలో భక్తుల చేత ప్రత్యేక అర్చనలు చేయించగా, న్యాల కంటి రాజేశ్వర శర్మ స్వామివారి ప్రధాన మండపంలో కూర్చొని వచ్చిన భక్తుల చేత స్వామివారికి ప్రత్యేక అర్చనలు చేయించారు. కోడె మొక్కులు, గండ దీపం, వంటి ప్రత్యేక పూజలను కైలాస్ సిద్దేశ్ చేయించారు. ఉదయం ప్రారంభమైన భక్తుల రద్దీ సాయంత్రం వరకు కొనసాగింది.






