- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైరాకు గోదావరి జలాలు రావడం చరిత్ర: వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్
వైరా రిజర్వాయర్‌కు సీతారామ ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలు రావడం ఓ చరిత్ర అని వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ అన్నారు.

దిశ, వైరా: వైరా రిజర్వాయర్‌కు సీతారామ ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలు రావడం ఓ చరిత్ర అని వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ అన్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రైతులు నారుమళ్లు పెంచుకునేందుకు వైరా రిజర్వాయర్ కుడి కాల్వ హెడ్ స్లూయిస్ వద్ద సుడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ తో కలిసి ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ శుక్రవారం సాగునీటిని విడుదల చేశారు. ముందుగా ఎమ్మెల్యే, సుడా చైర్మన్ గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ మాట్లాడుతూ వైరా రిజర్వాయర్ ఆయకట్టు రైతులకు గోదావరి జలాలు అందించేందుకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సహకారంతో రూ.100 కోట్లతో ప్రత్యేక కాల్వను నిర్మించామని గుర్తు చేశారు. ఈ కాల్వ ద్వారా గత మూడు రోజులుగా వైరా రిజర్వాయర్‌లోకి గోదావరి జలాలు వస్తున్నాయని స్పష్టం చేశారు. రిజర్వాయర్ ఆయకట్టు పరిధిలో రైతులు గత రబీ సీజన్లో సుమారు 200 కోట్ల రూపాయల పంటలను పండించాలని పేర్కొన్నారు. ఈ ఖరీఫ్ సీజన్ లో రూ. 225 కోట్ల విలువైన పంటలను రైతులు పండించాలని ఆకాంక్షించారు. రైతాంగ అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని చెప్పారు. రైతుల కోసం ప్రభుత్వం రైతు భరోసా, రైతు బీమా, ఉచిత కరెంట్, పంటలకు బోనస్, సబ్సిడీపై యంత్ర పరికరాలు తదితర పథకాలను అమలు చేస్తుందని వివరించారు. ఈ ఖరీఫ్ సీజన్లో వైరా ఆయికట్టులో రైతులు పంటలు సాగు చేసేందుకు కృషి చేస్తామన్నారు.
రైతాంగం సంక్షేమం కోసం...
ఏలినో ప్రభావం ఉన్నప్పటికీ గోదావరి జలాలను తీసుకువచ్చి సాగునీటిని విడుదల చేశామని చెప్పారు. రైతులు సాగునీటిని దుర్వినియోగం చేయవద్దని పేర్కొన్నారు. ప్రస్తుతం విడుదల చేసిన సాగునీటిని రైతులు నారుమళ్ళు పెంచుకునేందుకు వినియోగించుకోవాలని సూచించారు. రైతుల కోసం నిరంతరం కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అన్నదాతలు ఆశీర్వదించాలని కోరారు. సుడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ వైరా రిజర్వాయర్ అయకట్టులో పంటలు పండించేందుకు గోదావరి జలాలను తీసుకొచ్చామని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు తో మాట్లాడి సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు వైరాకు వచ్చేలా కృషి చేశామన్నారు. రైతాంగం సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో మార్క్ఫెడ్ రాష్ట్ర మాజీ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శీలం వెంకట నర్సిరెడ్డి, డాక్టర్ సెల్ జిల్లా అధ్యక్షులు కాపా మురళీకృష్ణ, వైరా మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కట్ల సంతోష్, పీసీసీ కార్యదర్శి కట్ల రంగారావు, ఆత్మ కమిటీ చైర్మన్ మట్టూరి వెంకటేశ్వరరావు, కిసాన్ కేత్ రాష్ట్ర నాయకులు దాసరి దానియేలు, టిడిపి వైరా నియోజకవర్గ ఇన్చార్జి చెరుకూరి చలపతి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు శీలం చంద్రశేఖర్ రెడ్డి, నాయకులు మచ్చా వెంకటేశ్వరరావు(బుజ్జి), దొడ్డా పుల్లయ్య, సూతకాని జైపాల్, ధార్న రాజశేఖర్, ఎదునూరి సీతారాములు, బీడీ కే రత్నం, వేముల రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.






