- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళ వేధింపుల కేసులో నిందితుడికి 2 ఏళ్ల జైలు శిక్ష
ఓ మహిళను వేధించిన కేసులో నిందితుడికి 2 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు కోర్టు జరిమానా విధించింది.

దిశ, మద్దూరు: ఓ మహిళను వేధించిన కేసులో నిందితుడికి 2 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.1500 జరిమానా విధిస్తూ చేర్యాల జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ కోర్టు సోమవారం సంచలన తీర్పును వెలువరించింది. వివరాల్లోకి వెళితే.. ధూళిమిట్ట మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన ధరావత్ డిప్లా నాయక్(50) పై ఓ మహిళ తనను వేధింపులకు గురిచేశాడని 2013లో మద్దూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను పరిశీలించిన పిదప చేర్యాల ఫస్ట్ క్లాస్ జడ్జ్ బానోతు శ్రీరామ్ నిందితుడు దీప్లా నాయక్ కు 2 సంవత్సరాల ఖైదుతో పాటు రూ.1500 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. ఈ కేసులో ప్రభుత్వ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎల్ తిరుపతి సమర్థవంతంగా వాదనలు వినిపించారు. కేసు దర్యాప్తు నిర్వహించిన అప్పటి ఎస్‌ఐ ఎస్ సాంబమూర్తి, సీఐ ఎస్ వేణుగోపాల్, ప్రస్తుతం మద్దూర్ ఎస్‌హెచ్‌ఓ ఎండి అసిఫ్, కోర్టు లైజనింగ్ అధికారి డి శ్రీనివాస్ రెడ్డి (హెడ్ కానిస్టేబుల్), సీడీఓ ఎం శ్రీనివాస్ (పీసీ-959) సమన్వయంతో కేసులో నిందితుడికి శిక్ష పడేలా చర్యలు చేపట్టారు.






