బోదేపల్లి శివారులో గుర్తుతెలియని మృతదేహం

by Batti.Sumithra |

బాల్కొండ మండలం బోదేపల్లి గ్రామ శివారులోని భూమయ్యకుంట సమీపంలోని పెద్ద కాలువ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించినట్లు బాల్కొండ ఎస్‌ఐ శైలేందర్ తెలిపారు.

బోదేపల్లి శివారులో గుర్తుతెలియని మృతదేహం
X

దిశ, బాల్కొండ : బాల్కొండ మండలం బోదేపల్లి గ్రామ శివారులోని భూమయ్యకుంట సమీపంలోని పెద్ద కాలువ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించినట్లు బాల్కొండ ఎస్‌ఐ శైలేందర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మృతుడి వయస్సు సుమారు 35 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండవచ్చని అంచనా. మృతుడు ముదురు నీలం రంగు గీతల షర్టు, నైట్ ప్యాంటు ధరించి ఉండగా, తల గుండు ఉన్నట్లు గుర్తించారు. ఈ వివరాలకు సరిపోలే వ్యక్తి ఎవరైనా కనిపించకపోయినా లేదా అతడి గురించి సమాచారం తెలిసినా వెంటనే బాల్కొండ పోలీసులను సంప్రదించాలని కోరారు.

సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు:

బాల్కొండ పోలీస్ స్టేషన్ : 8712659756

బాల్కొండ ఎస్‌ఐ : 8712659860

బాల్కొండ సీఐ : 8712659859

Next Story