భారీ ఊర‌ట‌..ఈ నెల 20 తర్వాత వర్షాలకు ఛాన్స్!

by velandi.Saikiran |

రైతుల‌కు బిగ్ న్యూస్ అందింది. ఈ నెల 20 తర్వాత వర్షాలకు ఛాన్స్ ఉన్న‌ట్లు స‌మాచారం అందుతోంది.

భారీ ఊర‌ట‌..ఈ నెల 20 తర్వాత వర్షాలకు ఛాన్స్!
X

దిశ‌, వెబ్ డెస్క్: దేశ వ్యాప్తంగా వర్షాలు లేక రైతులు అల్లాడిపోతున్నారు. మొన్నటి వరకు మహారాష్ట్ర, కొన్ని ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు పడినప్పటికీ.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మాత్రం వర్షాల జాడే కనిపించడం లేదు. ఈ ఏడాది ఎల్ నినో (El Nino) ప్రభావం ఉన్న నేపథ్యంలో వర్షాలు పడడం కష్టమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి క్రమంలో రైతులకు ఊరట ఇస్తూ ఓ బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ నెల 20వ తేదీ తర్వాత దేశ వ్యాప్తంగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

బంగాళాఖాతం నుంచి పసిఫిక్ మహా సముద్రం వరకు 7000 నుంచి 10000 కిలో మీటర్ల పొడవుతో ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ విస్తరించిందని వాతావరణ నిపుణులు స్పష్టం చేశారు. దీని వల్ల తేమతో కూడిన వెచ్చని గాలులు పైకి ఎగిసిపడి.. భారీ మేఘాలు ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. దీని ప్రభావంతో ఈనెల 20 నుంచి 30వ తేదీ మధ్య దేశవ్యాప్తంగా వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. దీంతో రైతులకు భారీ ఊరట లభించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Next Story