- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫ్లెమింగ్ ఔట్..CSK కోసం రంగంలోకి ద్రావిడ్ ?
ఫ్లెమింగ్ స్థానంలో CSK కోచ్ గా ద్రావిడ్ బాధ్యతలు తీసుకోనున్నట్లు టాక్ నడుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: చెన్నై సూపర్ కింగ్స్ హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన కోచ్ పదవికి రాజీనామా చేస్తూ, చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో బంధం తెంపుకున్నారు. దాదాపు 18 సంవత్సరాలుగా ఆ జట్టుకు సేవలు అందించిన స్టీఫెన్ ఫ్లెమింగ్... 2008లో ప్లేయర్ గా కూడా ఆడారు. అనంతరం హెడ్ కోచ్ బాధ్యతలు తీసుకున్నారు. వరుస సీజన్లలో చెన్నై ప్రదర్శన సరిగ్గా లేకపోవడంతో, స్టీఫెన్ ఫ్లెమింగ్ తప్పుకున్నట్లు సమాచారం.
స్టీఫెన్ ఫ్లెమింగ్ స్థానంలో ఎవరంటే ?
చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు దూరమైన స్టీఫెన్ ఫ్లెమింగ్ స్థానంలో కొత్త హెడ్ కోచ్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది యాజమాన్యం. ఈ క్రమంలోనే హేమంగ్ బదానీ, బ్రెండన్ మెక్‌కల్లమ్, రవిచంద్రన్ అశ్విన్ లాంటి వాళ్ళ పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ రాహుల్ ద్రావిడ్ కు కోచింగ్ బాధ్యతలు ఇవ్వాలని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిర్ణయం తీసుకున్నట్లు నేషనల్ మీడియాలో సరికొత్త కథనం వైరల్ గా మారింది. ఈ మేరకు రాహుల్ ద్రావిడ్ తో చర్చలు కూడా జరుగుతున్నాయట.






