- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నకిలీ సైబర్ క్రైమ్ పోలీస్‌పై కేసు..
by Kodari Anjali |
తాను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్‌నంటూ యువకులను బెదిరించి వసూళ్లకు పాల్పడబోయిన ఓ నకిలీ పోలీసుపై హుస్నాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

X
దిశ, హుస్నాబాద్: తాను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్‌నంటూ యువకులను బెదిరించి వసూళ్లకు పాల్పడబోయిన ఓ నకిలీ పోలీసుపై హుస్నాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఈ నెల 12న రాత్రి హుస్నాబాద్ బస్టాండ్ వద్ద ఇద్దరు యువకులను తరీగొప్పులకు చెందిన రాంకుమార్ అనే వ్యక్తి అడ్డుకున్నాడు. మీపై కేసులు ఉన్నాయని, వాటి నుంచి తప్పించాలంటే రూ.15 వేలు ఇవ్వాలని బెదిరించాడు. మాపై ఎలాంటి కేసులు లేవని, పోలీస్ స్టేషన్‌కు వెళ్దామని యువకులు ఎదురు తిరగడంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితుల ఫిర్యాదు మేరకు రాంకుమార్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ లక్ష్మారెడ్డి తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Next Story






