- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాదయాత్రలతో ప్రజాపాలనను కదిలిద్దాం
జవహార్‌నగర్ డంపింగ్ యార్డ్ వల్ల పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సమస్య పరిష్కారం కోసం పాదయాత్రలు, ప్రజా ఉద్యమాలను మరింత ఉధృతం చేయాలని డంపింగ్ యార్డ్ వ్యతిరేక పోరాట కమిటీ చైర్మన్ షేక్ షావలి పిలుపునిచ్చారు.

దిశ, జవహార్‌నగర్ : జవహార్‌నగర్ డంపింగ్ యార్డ్ వల్ల పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సమస్య పరిష్కారం కోసం పాదయాత్రలు, ప్రజా ఉద్యమాలను మరింత ఉధృతం చేయాలని డంపింగ్ యార్డ్ వ్యతిరేక పోరాట కమిటీ చైర్మన్ షేక్ షావలి పిలుపునిచ్చారు. సోమవారం కో-కన్వీనర్ మేక లలితాయాదవ్ ఆధ్వర్యంలో జవహార్‌నగర్ రాజీవ్‌గాంధీనగర్‌లో డంపింగ్ యార్డ్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. డంపింగ్ యార్డ్‌ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు, కమిటీ సభ్యులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా షేక్ షావలి మాట్లాడుతూ, డంపింగ్ యార్డ్ నుంచి వెలువడుతున్న దుర్వాసన, రసాయనాల ప్రభావంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. చిన్నారుల ఎదుగుదల, మహిళల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతోందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాంకీ యాజమాన్యం డంపింగ్ యార్డ్‌ను తొలగించే వరకు పోరాటం కొనసాగిస్తామని ప్రకటించారు. పాదయాత్రతో పాటు ఆటపాటల ద్వారా డంపింగ్ యార్డ్ సమస్యపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆరుణ, సునీత, శివబాబు, స్వరూప, లక్ష్మీబాయి, సావిత్రి, వేణు, కాలేషా, డంపింగ్ యార్డ్ పరిసర ప్రాంతాల కాలనీవాసులు పాల్గొన్నారు.






