కుటుంబ కలహాలతో యువకుడి ఆత్మహత్య

by Kodari Anjali |

కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ యువకుడు మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడిన సంఘటన వర్గల్ మండలం మజీద్‌పల్లి గ్రామంలో చోటుచేసుకుంది.

కుటుంబ కలహాలతో యువకుడి ఆత్మహత్య
X

దిశ, వర్గల్: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ యువకుడు మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడిన సంఘటన వర్గల్ మండలం మజీద్‌పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. బేగంపేట ఎస్సై రేణుక తెలిపిన వివరాల ప్రకారం...మజీద్‌పల్లి గ్రామానికి చెందిన సలేంద్ర వెంకటేశ్ (24) ఈ నెల 12వ తేదీ రాత్రి ఇంట్లో గొడవ జరగడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఆ రాత్రి వేళ ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన అతడు. తిరిగి రాలేదు. సోమవారం ఉదయం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉన్న ఓ చెట్టుకు వెంకటేశ్ ఉరివేసుకుని విగతజీవిగా వేలాడుతూ కనిపించాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి తల్లి బాలవ్వ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బేగంపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రేణుక పేర్కొన్నారు. యువకుడి మృతితో మజీద్‌పల్లిలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Next Story