20 నెలల చిన్నారి ప్రాణాలను కాపాడండి

by Ratna Kumari |

నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలంలోని గోరిట గ్రామానికి చెందిన 20 నెలల చిన్నారి ఇషాన్ ఆర్విక్ బ్రెయిన్ ఫంగల్ ఇన్‌ఫెక్షన్‌తో తీవ్ర అస్వస్థతకు గురై హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నాడు.

20 నెలల చిన్నారి ప్రాణాలను కాపాడండి
X

దిశ, తిమ్మాజీపేట : నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలంలోని గోరిట గ్రామానికి చెందిన 20 నెలల చిన్నారి ఇషాన్ ఆర్విక్ బ్రెయిన్ ఫంగల్ ఇన్‌ఫెక్షన్‌తో తీవ్ర అస్వస్థతకు గురై హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నాడు. చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సహాయం అందించాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. చిన్నారి తండ్రి చిలుక రాకేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇషాన్ ఆర్విక్ గత నెల రోజులుగా హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (పీఐసీయూ)లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడని తెలిపారు. వైద్యులు చికిత్సకు రూ.30 నుంచి రూ.35 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పారని, ఇప్పటికే కుటుంబం తమ పొదుపు మొత్తాన్ని ఖర్చు చేసి సుమారు రూ.10 లక్షలు వెచ్చించినట్లు రాకేష్ తెలిపారు. అప్పులు చేసి, తెలిసిన వారి సహకారంతో ఇప్పటి వరకు చికిత్స కొనసాగించామని, ఇకపై అయ్యే భారీ ఖర్చును భరించే స్థోమత తమకు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. "ప్రతి శ్వాస కోసం మా బిడ్డ పోరాడుతున్నాడు. మా వద్ద ఉన్న అన్ని వనరులు వినియోగించాం. ఇప్పుడు దాతల సహాయమే మా ఆశ. మా కుమారుడికి మరో జీవితం ఇవ్వాలని దయచేసి ముందుకు రావాలి"** అని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. సహాయం చేయదలిచిన దాతలు 73865 28640, 73962 48640 ఈ ఫోన్ నంబర్లలో సంప్రదించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

Next Story