రాష్ట్ర స్థాయి క్రీడల్లో జిల్లా పోలీసుల సత్తా

by Batti.Sumithra |

హైదరాబాద్‌లో ఇటీవల నిర్వహించిన నాలుగో తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు క్రీడల్లో ఆదిలాబాద్ జిల్లా పోలీసు శాఖకు చెందిన ఐదుగురు సిబ్బంది మొత్తం 10 పథకాలు (3 స్వర్ణ, 2 రజత, 5 కాంస్య) సాధించి జిల్లా ఖ్యాతిని చాటారు.

రాష్ట్ర స్థాయి క్రీడల్లో జిల్లా పోలీసుల సత్తా
X

దిశ, ఆదిలాబాద్ : హైదరాబాద్‌లో ఇటీవల నిర్వహించిన నాలుగో తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు క్రీడల్లో ఆదిలాబాద్ జిల్లా పోలీసు శాఖకు చెందిన ఐదుగురు సిబ్బంది మొత్తం 10 పథకాలు (3 స్వర్ణ, 2 రజత, 5 కాంస్య) సాధించి జిల్లా ఖ్యాతిని చాటారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో విజేతలను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు. యోగా విభాగంలో ఏ. రోహిణి రెండు స్వర్ణ, ఒక కాంస్య పతకం, పి.పూజ ఒక స్వర్ణ, ఒక కాంస్య పతకం, ఏ. రూప ఒక రజత, ఒక కాంస్య పతకం సాధించారు.

ఏ. ప్రశాంత్ టైక్వాండో, పెన్‌కాక్ సిలాట్ విభాగాల్లో రెండు కాంస్య పతకాలు గెలుచుకోగా, పి.మీర్ సింగ్ బాడీ బిల్డింగ్‌లో రజత పతకం సాధించారు. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ విధి నిర్వహణతో పాటు క్రీడల్లోనూ రాణిస్తూ జిల్లా పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో మరిన్ని రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ కమతం ఇంద్రవర్ధన్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు డి. వెంకటి, ఎన్.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story