- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సమగ్ర చట్టం కోసం సలహాలు ఇవ్వండి: జయేశ్ రంజన్
తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్) చట్టం-2026 కోసం సలహాలు, సూచనలు ఇవ్వాలని మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ కోరారు...

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్) చట్టం-2026 కోసం సలహాలు, సూచనలు ఇవ్వాలని మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ కోరారు. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్) చట్టం-2026 ముసాయిదాపై ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా సోమవారం కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులతో మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ , జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ.కర్ణన్ కలిసి ఒక ఇంటరాక్టివ్ సమావేశాన్ని నిర్వహించారు. జయేశ్ రంజన్ 'క్యూర్' చట్టం ముఖ్య ఉద్దేశాలను, విశిష్ట లక్షణాలను వివరించారు. సమగ్ర పట్టణ పరిపాలన, మెరుగైన పౌర సేవల లభ్యత, పర్యావరణ పరిరక్షణ, డిజిటల్ గవర్నెన్స్, లింగ సమానత్వం (జెండర్ ఇన్‌క్లూజన్), పౌర కేంద్రిత పరిపాలనే ధ్యేయంగా ఈ చట్టాన్ని తీసుకువస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
కాలనీ సంఘాల ప్రతిపాదనలు..
ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూనే, కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు పలు విలువైన సూచనలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. చట్టం పరిధిలో ఏర్పాటు చేసే వివిధ కమిటీలలో నివాసితుల సంక్షేమ సంఘాల ప్రతినిధులకు చోటు కల్పించాలని, తద్వారా పౌరుల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయవచ్చని కోరారు. బహిరంగ ఆటస్థలాల్లో బాలికలు, మహిళల కోసం ప్రత్యేక వేళలను కేటాయించాలని ప్రతిపాదించారు. పబ్లిక్ ప్రాంతాలలో శానిటరీ ప్యాడ్ వెండింగ్ మిషన్లు, ఇన్సినరేటర్లను (వ్యర్థాల నిర్మూలన యంత్రాలు) ఏర్పాటు చేయాలని కోరారు. ప్రజా రవాణా, బహిరంగ ప్రదేశాలలో మెరుగైన లైటింగ్, నిఘా (సీసీటీవీ), భద్రతా చర్యలను పెంచడం ద్వారా మహిళల రక్షణకు పెద్దపీట వేయాలని విజ్ఞప్తి చేశారు






