- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 సంవత్సరానికి "మత్స్యకారుల సేవలో" కార్యక్రమం కింద సముద్ర వేట నిషేధ కాల భృతి విడుదలకు సంబంధించిన ప్రభుత్వ జీవోను సోమవారం విడుదల చేసింది....

దిశ, ఏపీ బ్యూరో: మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 సంవత్సరానికి "మత్స్యకారుల సేవలో" కార్యక్రమం కింద సముద్ర వేట నిషేధ కాల భృతి విడుదలకు సంబంధించిన ప్రభుత్వ జీవోను సోమవారం విడుదల చేసింది. ఈ పథకం కింద మొదటి విడతలో 1,28,388 మంది మత్స్యకార కుటుంబాలకు రూ.256.776 కోట్లు విడుదల చేయగా, రెండో విడతలో సాంకేతిక, ఇతర కారణాల వలన మిగిలిన 5,910 మంది లబ్ధిదారులకు రూ.11.82 కోట్లు మంజూరు చేసింది. మొత్తంగా 1,34,298 మంది మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందనుంది. సముద్ర వేట నిషేధ కాలంలో ఉపాధి కోల్పోయే మత్స్యకార కుటుంబాలు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా వారికి అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ భృతిని ప్రభుత్వం అందిస్తోంది. మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, వారి జీవనోపాధి భద్రత కోసం తీసుకున్న మరో కీలక నిర్ణయంగా ఈ జీవో నిలుస్తుందని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.






