వర్షాలు సమృద్ధిగా కురవాలని గ్రామ దేవతలకు జలాభిషేకం

by Batti.Sumithra |

వర్షాలు సమృద్ధిగా కురవాలని వేడుకుంటూ సోమవారం రాజంపేట మండలంలోని ఆర్గొండ గ్రామంలో పోచమ్మ, గ్రామ దేవతలకు భక్తులు, రైతులు, స్థానికులు ప్రత్యేక పూజలు, జలాభిషేకాలు నిర్వహించారు.

వర్షాలు సమృద్ధిగా కురవాలని గ్రామ దేవతలకు జలాభిషేకం
X

దిశ, రాజంపేట్ : వర్షాలు సమృద్ధిగా కురవాలని వేడుకుంటూ సోమవారం రాజంపేట మండలంలోని ఆర్గొండ గ్రామంలో పోచమ్మ, గ్రామ దేవతలకు భక్తులు, రైతులు, స్థానికులు ప్రత్యేక పూజలు, జలాభిషేకాలు నిర్వహించారు. విస్తారంగా వర్షాలు కురిసి చెరువులు జలకళ సంతరించుకోవాలని, పంటలు సమృద్ధిగా పండాలని, పిల్లాపాపలతో సుఖంగా ఉండాలని మహిళలు నీళ్ల బిందెలు ఎత్తుకొని ఆలయాలకు చేరుకుని విగ్రహాలకు జలాభిషేకాలు, కొబ్బరికాయలు కొట్టారు. పసుపు-కుంకుమలతో ప్రత్యేక పూజలు చేశారు.

వర్షాలు పడక పంటలు ఎండిపోవడంతో రైతులు సకాలంలో వర్షాలు కురవాలని, పంటలు బాగా పండాలని కోరుకుంటూ గ్రామంలో ప్రాచీన ఆచారం కప్పతల్లి ఆట ఆడారు. కప్పను కట్టెకు మధ్యలో కట్టుకొని భుజాల పై అటు ఒకరు ఇటు ఒక్కరు ఎత్తుకొని గ్రామంలో వీధి వీధిన తిరుగుతూ ఇంటి వద్దకు రాగానే, ఆ కప్పలపైన మరియు కర్ర మోసేవారిపైన గ్రామస్తులు బిందెలతో నీళ్లు పోశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎర్ర విక్రాంత్ రెడ్డి, ఉపసర్పంచ్ తూల రవి, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Next Story