నిరుద్యోగులకు శుభవార్త... త్వరలోనే జాబ్ నోటిఫికేషన్

by Vemula.Srinu Prasad |

సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మరోసారి నిరుద్యోగులకు శుభవార్త చెప్పేందుకు పూర్తి స్థాయిలో సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగా రాష్ట్రంలో రెండవ దశ డైరెక్ట్ రిక్రూట్మెంట్ జాబ్ కేలండర్‌ను రూపొందించేందుకు సోమవారం ఏపీ సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ అధ్యక్షతన కార్యదర్శులు,శాఖాధిపతులతో సమావేశం నిర్వహించారు...

నిరుద్యోగులకు శుభవార్త... త్వరలోనే జాబ్ నోటిఫికేషన్
X

దిశ, ఏపీ బ్యూరో: సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మరోసారి నిరుద్యోగులకు శుభవార్త చెప్పేందుకు పూర్తి స్థాయిలో సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగా రాష్ట్రంలో రెండవ దశ డైరెక్ట్ రిక్రూట్మెంట్ జాబ్ కేలండర్‌ను రూపొందించేందుకు సోమవారం ఏపీ సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ అధ్యక్షతన కార్యదర్శులు,శాఖాధిపతులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా రెండవ దశ జాబ్ కేలండర్‌కు సంబంధించి భర్తీ చేయాల్సిన పోస్టుల నోటిఫికేషన్, కంప్లీషన్ ఆఫ్ ఇ-హెచ్ఆర్ఎం, లోకల్ కేడర్ ఆర్గనైజేషన్ కు అనుగుణంగా నోటిఫికేషన్, నూతన లోకల్ కేడర్లలో పోస్టుల కేటాయింపు నోటిఫికేషన్,అన్ని కేడర్లలో ప్రాధాన్యత కేటగిరీలకు సంబంధించి సీనియారిటీ జాబితా ప్రిపరేషన్,ఎలాంట్మెంట్ ఆఫ్ పెర్సన్స్, ఓపెనింగ్ ఆఫ్ రోస్టర్స్, ఎపిపిఎస్సి ఇతర రిక్రూటింగ్ ఏజెన్సీలకు ఇండెంట్స్ పంపడం తదితర అంశాలపై సమీక్షించారు. ఈ ప్రక్రియను నిర్దిష్ట వ్యవధి ప్రకారం సకాలంలో పూర్తి చేయాలని సి.ఎస్ సాయి ప్రసాద్ కార్యదర్శులు, హెచ్ఓడిలను ఆదేశించారు. అంతేగాక బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన అన్ని అంశాల్లో ఉద్యోగులతో పూర్తి స్నేహపూర్వకంగా,మర్యాదపూర్వకంగా వ్యవహరించి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. పెండింగ్లో ఉన్న వివిధ క్రమశిక్షణా చర్యలకు సంబంధించిన కేసుల పరిష్కారనికి ఇదే సరైన సమయమని గత 6 నెలల వ్యవధిలోపు పరిష్కరించాల్సిన కేసులన్నిటినీ వేగవంతంగా పరిష్కరించాలని సిఎస్ సాయి ప్రసాద్ ఆదేశించారు.

అంతకుముందు సర్వీసెస్, హెచ్ఆర్ఎం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ మాట్లాడుతూ రెండవ దశ జాబ్ కేలండర్ కు సంబంధించి భర్తీ చేయాల్సిన పోస్టుల నోటిఫికేషన్, కంప్లీషన్ ఆఫ్ ఇ-హెచ్ఆర్ఎం, లోకల్ కేడర్ ఆర్గనైజేషన్ కు అనుగుణంగా నోటిఫికేషన్,నూతన లోకల్ కేడర్లలో పోస్టుల కేటాయింపు నోటిఫికేషన్ తదితర అంశాలకు సంబంధించిన టైమ్ లైన్ ను వివరించారు. ఆ నిర్దేశిత టైమ్ లైన్ ప్రకారం ఉద్యోగుల కేటాయింపు తదితర చర్యలు పూర్తి చేయాలని ఇందుకు సంబంధించిన జిఓ లను వెంటనే జారీ చేయడం జరుగుతుందని చెప్పారు.

ఈ సమావేశంలో స్పెషల్ సిఎస్‌లు బి.రాజ శేఖర్, కృష్ణ బాబు, జి.జయలక్మి,ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు,వివిధ శాఖాధిపతులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Next Story