మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వ నిధుల పూర్తి వినియోగం: ఎమ్మెల్యే కాలే యాదయ్య

by Kodari Anjali |

చేవెళ్ల మున్సిపాలిటీని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా అభివృద్ధి చేయడానికి శాయశక్తులా కృషి చేస్తామని చేవెళ్ల నియోజకవర్గ శాసనసభ్యులు కాలే యాదయ్య స్పష్టం చేశారు.

మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వ నిధుల పూర్తి వినియోగం: ఎమ్మెల్యే కాలే యాదయ్య
X

దిశ, చేవెళ్ల: ప్రభుత్వం ద్వారా వచ్చే వివిధ రకాల నిధులను వంద శాతం సద్వినియోగం చేసుకుంటూ, చేవెళ్ల మున్సిపాలిటీని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా అభివృద్ధి చేయడానికి శాయశక్తులా కృషి చేస్తామని చేవెళ్ల నియోజకవర్గ శాసనసభ్యులు కాలే యాదయ్య స్పష్టం చేశారు. చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని పామెన వార్డులో సోమవారం పలు అభివృద్ధి పనులను ఆయన స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. వార్డు కౌన్సిలర్ గోపాల్ రెడ్డి తన సొంత నిధులు రూ. 25 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన బిటి (BT) రోడ్డును ఎమ్మెల్యే కాలే యాదయ్య రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. అనంతరం మున్సిపల్ సాధారణ నిధులు రూ. 5 లక్షలతో చేపట్టనున్న సిసి (CC) రోడ్డు నిర్మాణ పనులకు చేశారు. ఈ సందర్భంగా పామెన గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు కూడా ఆయన ప్రారంభించిరు. ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ...ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు చేతులు మీదిగా పని ప్రారంభించారు. నాలుగు రోజులలోనే రోడ్డుపనులు పూర్తయ్యాయి.

గోపాల్ రెడ్డిని అభినందించిన ఎమ్మెల్యే కాలే యాదయ్య..

ప్రభుత్వం అందిస్తున్న నిధులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా సొంతంగా చొరవ తీసుకుని గ్రామాల అభివృద్ధికి తోడ్పడటం అభినందనీయం. కౌన్సిలర్ గోపాల్ రెడ్డి తన సొంత నిధులు రూ. 25 లక్షలు వెచ్చించి బిటి రోడ్డు నిర్మించడం ఆయనకు ప్రజలపై ఉన్న నిబద్ధతకు నిదర్శనం. ప్రతి ఒక్కరూ ఇలాగే వార్డుల ప్రగతికి భాగస్వాములు కావాలి. మున్సిపాలిటీ పరిధిలో అంతర్గత రహదారుల నిర్మాణం, తాగునీరు, డ్రైనేజీ వంటి మౌలిక వసతుల కల్పనకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాం. మహిళల ఆర్థిక, సామాజిక సాధికారత కోసమే ఇందిరా మహిళా భవనాన్ని అందుబాటులోకి తెచ్చాం. రాబోయే రోజుల్లో చేవెళ్ల మున్సిపాలిటీని మరింత సుందరంగా, సకల సదుపాయాలతో తీర్చిదిద్దుతామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story