- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విశాఖ ప్రజలకు తీపికబురు.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
విశాఖ ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు తీపికబురు అందించారు. త్వరలోనే గోదావరి జిలాలను అందిస్తామని ఆయన తెలిపారు. ఆగస్టు 14న విశాఖలో గోదావరి జలాలకు అఖండ హారతి ఇస్తామని స్పష్టం చేశారు. ...

దిశ, వెబ్ డెస్క్: విశాఖ ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు తీపికబురు అందించారు. త్వరలోనే గోదావరి జిలాలను అందిస్తామని ఆయన తెలిపారు. ఆగస్టు 14న విశాఖలో గోదావరి జలాలకు అఖండ హారతి ఇస్తామని స్పష్టం చేశారు. పోలవరంపై జగన్ ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడిందని గుర్తు చేశారు. 2017-19లో రూ. 440 కోట్లతో డయా ఫ్రమ్ వాల్ పూర్తి చేశామని, అయితే గత ప్రభుత్వం వరద నీటిలో కొట్టుకుపోయేలా చేసిందన్నారు. తాను అధికారంలో ఉండి ఇప్పటివరకూ 37 సార్లు పోలవరాన్ని సందర్శించానని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుపై కేంద్రంతో చాలాసార్లు సమీక్షలు చేశానని గుర్తు చేశారు. కేంద్రం సైతం పోలవరం ప్రాజెక్టుకు సహరిస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు పనులు ఎలాంటి అడ్డంకులు లేకుండా సకాలంలో జరుగుతున్నాయన్నారు. గత రెండు సంవత్సరాలుగా 15 శాతం పనులు పూర్తి అయ్యాయని వెల్లడించారు. పోలవరం ద్వారా 7.2 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు ఏర్పడిందన్నారు. పోలవరం పూర్తి అయితే 194 టీఎంసీల నీరు నిల్వ చేసుకోవచ్చాన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోలవరం జీవనాడిలాంటిదని సీఎం చంద్రబాబు తెలిపారు.






