ఏపీలో SIR ప్రక్రియ.. 14 లక్షలకు పైగా మరణించిన ఓటర్ల గుర్తింపు

by Vemula.Srinu Prasad |

ఏపీలో ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సోషల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ప్రక్రియ అత్యంత వేగంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అధికారుల బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. ..

ఏపీలో SIR ప్రక్రియ.. 14 లక్షలకు పైగా మరణించిన ఓటర్ల గుర్తింపు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సోషల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ (SIR) ప్రక్రియ అత్యంత వేగంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అధికారుల బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. ఎన్నికల ప్రక్రియను మరింత పారదర్శకంగా మార్చడమే లక్ష్యంగా నిర్వహిస్తున్నారు.

కోట్ల సంఖ్యలో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ

ఈ ప్రక్రియలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 4,16,26,144 ఎన్యూమరేషన్ ఫారాలను ఓటర్లకు పంపిణీ చేశారు. అధికారులు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల నమోదు, మార్పులు-చేర్పులపై వివరాలను సేకరిస్తున్నారు. ప్రస్తుతం 1.67 శాతం ఎన్యూమరేషన్ ఫారాలు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని త్వరగా పూర్తి చేసేందుకు యంత్రాంగం చర్యలు చేపడుతోందని అధికారులు వెల్లడించారు.

14 లక్షలకు పైగా మరణించిన ఓటర్ల గుర్తింపు

ఈ సర్వేలో ఓటర్ల జాబితాలోని తప్పులను సరిదిద్దే క్రమంలో కీలక విషయాలు వెలుగుచూశాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 14,19,644 మంది ఓటర్లు మరణించినట్లు అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనలో గుర్తించారు. ఈ బోగస్, మరణించిన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించి, రాబోయే ఎన్నికల నాటికి అత్యంత ఖచ్చితమైన, పారదర్శకమైన ఓటర్ల జాబితాను సిద్ధం చేయడమే ధ్యేయంగా అధికారులు పని చేస్తున్నారు.

Next Story