పుంగనూరు టీడీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు.. పరస్పరం దాడులు

by Vemula.Srinu Prasad |

తిరుపతి గ్రాండ్ రిడ్జ్ హోటల్ వేదికగా పుంగనూరు నియోజకవర్గ టీడీపీలో తీవ్ర వర్గ విభేదాలు భగ్గుమన్నాయి.నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ మార్పు ప్రతిపాదనపై ఇరు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో చర్చ కొనసాగింది. ఈ క్రమంలోనే టీడీపీ కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయారు...

పుంగనూరు టీడీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు.. పరస్పరం దాడులు
X

దిశ, వెబ్ డెస్క్: తిరుపతి గ్రాండ్ రిడ్జ్ హోటల్ వేదికగా పుంగనూరు నియోజకవర్గ టీడీపీలో తీవ్ర వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ మార్పు ప్రతిపాదనపై ఇరు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో చర్చ కొనసాగింది. ఈ క్రమంలోనే టీడీపీ కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయారు. ప్రస్తుత ఇన్‌ఛార్జ్ చల్లా బాబు మద్దతుదారులు, మరో నేత మధుసూదన్ నాయుడు అనుచరులు ఒకరిపై ఒకరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసుకున్నారు. మాటల యుద్ధం కాస్తా పరస్పర దాడులకు దారితీసింది. దీంతో పరిస్థితి తీవ్రంగా మారింది. ఈ గొడవలో రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి ముళ్లగి వెంకటరమణపై తీవ్రస్థాయిలో దాడి జరిగింది. ఈ దాడిలో ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ఘటన గ్రాండ్ రిడ్జ్ హోటల్ పరిసరాల్లో కలకలం రేపింది.

Next Story