- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి స్వాగతం పలికిన బీజేపీ శ్రేణులు..
నాయకులతో కలిసి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అల్పాహారం స్వీకరించారు.

దిశ, కూసుమంచి: కేంద్ర గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి సింగరేణి భరోసా కార్యక్రమం నిమిత్తం సోమవారం కొత్తగూడెం వెళ్తుండగా నాయకన్ గూడెం సింగరేణి పల్లి టోల్ ప్లాజా వద్ద గల ఆదిత్య ఫ్యామిలీ రెస్టారెంట్‌లో ఖమ్మం జిల్లా బీజేపీ నాయకులు కెంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర పార్టి అధ్యక్షుడు రామచందర్ రావులకు పూలబొకేలు ఇచ్చి ఖమ్మం జిల్లా పార్టి అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు, జిల్లా నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కిషన్ రెడ్డి బీజేపీ ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్సీ మహేశ్వరరెడ్డి తదితర ఎమ్మెల్యేలతో కలిసి ఆదిత్యా రెస్టారెంట్‌లో అల్పాహారం స్వికరించారు. అనంతరం నాయకులు శాలువాలతో కిషన్ రెడ్డిని, రామచందర్ రావును సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ నాయకులు దేవకీ వాసుదేవ రావు, నన్నే ఉదయ ప్రతాప్, కొండపల్లి శ్రీధర్ రెడ్డి, నున్నా రవి, బీజేపీ మండల పార్టి అధ్యక్షురాలు పుణ్యవతి, మండల నాయకులు గుండా ఉపేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.






