- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీ బిజీ.. కేంద్రమంత్రులతో కీలక భేటీలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. కేంద్రమంత్రులతో విరివిగా ఆయన భేటీ అవుతున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. కేంద్రమంత్రులతో విరివిగా ఆయన భేటీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రంలోని వివిధ రైల్వే ప్రాజెక్టుల పూర్తి, కొత్త రైలు మార్గాలు, సర్వీసులు నడపాలని కేంద్ర మంత్రికి వినతి పత్రం అందజేశారు. ఇటీవల బడ్జెట్‌లో ప్రకటించిన హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై, చెన్నై-బెంగళూరు హై స్పీడ్ రైల్ కారిడార్ల గురించి భేటీలో ప్రస్తావించినట్టు సమాచారం. అంతకు ముందు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు.
ఏపీ రాజధానిగా అమరావతి..
ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత వ్యవహారంపై చర్చించినట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే పార్లమెంటులో బిల్లు పెట్టాలని కేంద్రం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా కేంద్ర హోంశాఖ క్యాబినెట్ నోట్ తయారీలో ఉన్నట్లు సమాచారం. అలాగే బడ్జెట్ రెండో దశ సమావేశాల్లో బిల్లు పెట్టాలని సీఎం కోరనున్నట్లు సమాచారం. అలాగే జలశక్తిశాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు, జల జీవన్ మిషన్ పథకానికి నిధులు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పురోగతిపై ఇరువురు నేతలు చర్చించనున్నట్లు అధికార వర్గాల సమాచారం. అదేవిధంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు బృందం సమావేశం నిర్వహించి కీలక చర్చలు జరిపారు.






