సీఎం చంద్రబాబుతో క్రికెట్ దిగ్గజం సచిన్ భేటీ..

by Ramesh Naini |   (  Updated:2026-02-10 14:53:32  IST  )

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ మధ్య జరిగిన మర్యాదపూర్వక భేటీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సీఎం చంద్రబాబుతో క్రికెట్ దిగ్గజం సచిన్ భేటీ..
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ మధ్య జరిగిన మర్యాదపూర్వక భేటీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబును, ఢిల్లీ విమానాశ్రయంలో సచిన్ టెండూల్కర్ యాదృచ్ఛికంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇరువురు కాసేపు ఆత్మీయంగా ముచ్చటించారు. సీఎం చంద్రబాబును కలవడం పట్ల సచిన్ టెండూల్కర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సమావేశంపై ఆయన ట్వీట్ చేస్తూ.. ‘చంద్రబాబు నాయుడు గారిని కలవడం గొప్ప అనుభూతిని ఇచ్చింది. ఆయన ఎప్పుడూ ఆయురారోగ్యాలతో, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. సచిన్‌తో దిగిన ఫోటోను సీఎం చంద్రబాబు కూడా తన ట్విట్టర్ (X) ఖాతాలో పంచుకున్నారు. ‘ఢిల్లీ విమానాశ్రయంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ను కలవడం చాలా సంతోషంగా ఉంది’ అని ఆయన రాసుకొచ్చారు. ఈ భేటీపై రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ఇద్దరు దిగ్గజాలు ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో అభిమానులు, కార్యకర్తలు పండగ చేసుకుంటున్నారు.

ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీ బిజీ.. కేంద్రమంత్రులతో కీలక భేటీలు

Next Story