- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మావోయిస్టులకు షాక్.. లొంగిపోయిన మరో కీలక సభ్యుడు
మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా దళాలు ఆపరేషన్ కగార్ (Operation Kagar) నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా దళాలు ఆపరేషన్ కగార్ (Operation Kagar) నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరో మావోయిస్టు కీలక సభ్యుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. దీంతో మావోయిస్టు నేతలకు ఊహించని ఎదురుదెబ్బ తగిలినట్లయింది. 20 ఏళ్లకు పైగా మావోయిస్టుల దళంలో ఉన్న దిరిదో దేవా (34) మంగళవారం లొంగిపోయినట్లు ఎస్పీ అమిత్ (SP Amith) వెల్లడించారు. ఆపరేషన్ కగార్ భయంతోనే ఛత్తీస్ గఢ్ ఏరియా కమిటీ మెంబర్ గా ఉన్న దేవా (ACM Deva) లొంగిపోయినట్లు చెప్పారు. దేవాపై రూ. 3 లక్షల రివార్డు ఉందని, ఏపీ ప్రభుత్వంతో మాట్లాడి ఆ రివార్డును అతనికి అందేలా చూస్తామని తెలిపారు.
లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కల్పించి.. జనజీవన స్రవంతిలో కలిసేలా ఉపాధి అవకాశాలను కల్పించడం వల్ల మావోయిస్టుల్లో మార్పు వస్తోందన్నారు. క్రమంగా మావోయిస్టు పార్టీకి ఆదరణ తగ్గడంతో వారు లొంగిపోతున్నట్లు ఎస్పీ అమిత్ తెలిపారు. గత శనివారం నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన ఏడుగురు తెలంగాణలోని ములుగు జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయారు. వీరిలో నలుగురు మహిళలు ఉన్నారు.
Read More..
BREAKING: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సెక్రటరీగా తిప్పిరి తిరుపతి నియామకం






