నందమూరి వారసులను చూసి చంద్రబాబుకు భయం: Perni Nani

by Satheesh |   (  Updated:2023-01-27 13:18:03  IST  )

నందమూరి వారసులను చూసి చంద్రబాబు భయపడుతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు.

నందమూరి వారసులను చూసి చంద్రబాబుకు భయం: Perni Nani
X

దిశ, వెబ్‌డెస్క్: నందమూరి వారసులను చూసి చంద్రబాబు భయపడుతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా కుప్పం బహిరంగ సభలో వైసీపీ నేతలపై చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. లోకేష్, చంద్రబాబు చెప్పే మాటలను ప్రజలు నమ్మరని ఎద్దేవా చేశారు. నారా లోకేష్ కుప్పం సభలో బరితెగించి అబద్ధాలు మాట్లాడారని మండిపడ్డారు. చంద్రబాబు మంచి పనులు చేస్తే.. లోకేష్ ఎందుకు బజారునపడుతారని ప్రశ్నించారు. లోకేష్ పాదయాత్ర ప్రయోజిత కార్యక్రమం అని సెటైర్లు వేశారు.

Read more:

నారా లోకేశ్ పాదయాత్ర వెనుక సీక్రెట్ అదే: Kodali Nani

Next Story