తమిళనాడులో విజయ్ గెలుపు.. ఏపీలో జోష్

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-05-04 13:18:25  IST  )

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే (తమిళగ వెట్రి కళగం) ప్రభంజనం సృష్టించడంతో ఆంధ్రప్రదేశ్‌లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి....

తమిళనాడులో విజయ్ గెలుపు.. ఏపీలో జోష్
X

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో(Tamilanadu Assembly Elections) విజయ్ నేతృత్వంలోని టీవీకే (తమిళగ వెట్రి కళగం) ప్రభంజనం సృష్టించడంతో ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Ysr Congress Party) శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు, వైసీపీ నాయకుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి(Chevireddy Harshit Reddy) ఆధ్వర్యంలో భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి, విజయ్ ఫోటోలతో కార్యకర్తలు బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుతూ సందడి చేశారు.

చంద్రబాబు పతనం మొదలైంది: హర్షిత్ రెడ్డి

ఈ వేడుకల్లో చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పతనం తమిళనాడు నుంచి ప్రారంభమైందని, అది ఆంధ్రప్రదేశ్‌లో ముగుస్తుందని జోస్యం చెప్పారు. తమ నాయకుడు జగనన్న లాగే విజయ్ కూడా ఎవరితోనూ పొత్తులు పెట్టుకోకుండా ఒంటరి పోరాటం చేసి అఖండ విజయాన్ని అందుకున్నారని కొనియాడారు. ప్రజల్లో బలం ఉన్న నాయకుడికి 'కంటెంట్ కాదు.. కటౌట్ ముఖ్యం' అని విజయ్ గెలుపు నిరూపించిందని ఆయన వ్యాఖ్యానించారు.

విజయ్‌కు శుభాకాంక్షలు

తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న విజయ్‌కు చంద్రగిరి నియోజకవర్గ ప్రజల తరఫున, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున హర్షిత్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. పొరుగు రాష్ట్రంలో వచ్చిన ఈ మార్పు ఆంధ్ర రాజకీయాల్లోనూ పెను మార్పులకు సంకేతమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ సంబరాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తమిళనాట సంచలనం.. డీఎంకే, ఏడీఎంకేను చిత్తుచిత్తుగా ఓడించిన ఆటో డ్రైవర్

Next Story