- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు చిక్కుల్లో పడ్డారు. సీఎంను అసభ్య పదజాలంతో దూషించారన్న ఆరోపణలపై గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. అంబటి రాంబాబు ముఖ్యమంత్రిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ శ్రేణులు, గుంటూరు జిల్లా ఎస్పీకి అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన పోలీసులు ప్రాథమిక ఆధారాలతో ఆయనపై కేసు నమోదు చేశారు.
అంబటి నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత
గుంటూరులోని నవభారత నగర్‌లో ఉన్న అంబటి రాంబాబు నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ శ్రేణులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆగ్రహించిన కొందరు కార్యకర్తలు అంబటి ఇంటిపై రాళ్లు రువ్వడం, ఆఫీస్ అద్దాలు, ఫర్నిచర్, కారును ధ్వంసం చేశారు. పరిస్థితిని గమనించిన పోలీసులు తక్షణమే అంబటి నివాసం వద్దకు చేరుకుని భారీగా మోహరించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో పోలీసుల పహారా కొనసాగుతోంది.






