- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వెయ్యిమందితో అంబటిపై మర్డర్ అటెంప్ట్: మాజీ మంత్రి
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటివద్ద నెలకొన్ని ఉద్రిక్త పరిస్థితులపై మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ స్పందించారు.

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటివద్ద నెలకొన్ని ఉద్రిక్త పరిస్థితులపై మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ స్పందించారు. శనివారం సాయంత్రం అమర్‌నాథ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ ఉందా? అని ప్రశ్నించారు. వెయ్యిమంది టీడీపీ కార్యకర్తలు అంబటి రాంబాబు మీద హత్యాయత్నం చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని అడిగారు. సాక్షాత్తు పోలీసుల సమక్షంలో దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులన్నింటినీ వైసీపీ గుర్తు పెట్టుకుంటుందని అమర్‌నాథ్ అన్నారు. ఏపీలో రెడ్ బుక్ ఆటవిక రాజ్యాంగం నడుస్తోందని సీరియస్ అయ్యారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే అంబటిపై దాడికి తెగబడ్డారని అన్నారు. ఆనాడు వంగవీటి రంగాను ఈ విధంగానే హత్య చేశారు.. ముద్రగడ పద్మనాభంను కూడా చంపాలని చూశారు.. ఇప్పుడు అంబటిపై కుట్ర చేస్తున్నారని అమర్‌నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
నన్ను తిట్టిన వారినే.. నేనూ తిట్టిన
ఇదిలా ఉంటే.. ఏపీ సీఎం చంద్రబాబుపై.. మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలతో గుంటూరులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అంబటి రాంబాబు ఇంటి ముట్టడికి టీడీపీ కార్యకర్తలు యత్నించడం.. ఉద్రిక్తతకు దారి తీసింది. మరోవైపు తనపై వస్తున్న ఆరోపణలపై అంబటి రాంబాబు స్పందించారు. తాను చంద్రబాబును తిట్టలేదని.. తనను అడ్డగించి, తిడుతున్నవారిని మాత్రమే తిట్టానని అన్నారు. మనిషిగా వాళ్లు తిడుతుంటే తానూ తిట్టానన్న అంబటి రాంబాబు.. ఈ వయసులో అలా మాట్లాడాల్సింది కాదని అన్నారు. మరోవైపు చంద్రబాబుపై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మండిపడ్డారు. మంత్రి పార్థసారథి, సీనియర్ లీడర్ వర్ల రామయ్య స్పందిస్తూ.. చంద్రబాబును, ఆయన తండ్రిని ఉద్దేశించి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.






