జోగి రమేశ్ ఇంటిపై దాడి: 40 మందిపై కేసులు.. 11 మందికి బెయిల్

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-02-02 13:04:46  IST  )

మాజీ మంత్రి జోగి రమేశ్ఇంటిపై దాడి చేసిన ఘటనలో పోలీసులు చర్యలు చేపట్టారు. ..

జోగి రమేశ్ ఇంటిపై దాడి: 40 మందిపై కేసులు.. 11 మందికి బెయిల్
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి జోగి రమేశ్(Former Minister Jogi Ramesh) ఇంటిపై దాడి చేసిన ఘటనలో పోలీసులు చర్యలు చేపట్టారు. మొత్తం 40 మంది టీడీపీ(Tdp) నేతలపై కేసులు నమోదు చేశారు. వీరిలో 11 మందిని అరెస్ట్ చేశారు. అయితే వారంతా స్టేషన్ బెయిల్‌పై విడుదల అయ్యారు. కాగా మంత్రి లోకేశ్ పై చేసిన అసభ్య వ్యాఖ్యలపై టీడీపీ నేతలు భగ్గుమన్నారు. విజయవాడ ఇబ్రహీంపట్నంలో జోగి రమేశ్ ఇంటిపై ఆదివారం దాడి చేశారు. రాళ్లు రువ్వడంతో పాటు ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. పెట్రోల్ బాంబులతో మంటలు రేపారు. అయితే ఈ ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఎవరైనా సరే కేసులు నమోదు చేయండని ఇబ్రహీంపట్నం పోలీసులను ఆదేశించారు. దీంతో టీడీపీ నేతలపై కేసులు నమోదు చేశారు. తాజాగా 11 మందిని అరెస్ట్ చేశారు. స్టేషన్ బెయిల్ మంజూరు చేశారు.

జోగి రోహిత్ పిటిషన్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు

Next Story