జోగి రోహిత్ పిటిషన్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-02-02 13:03:44  IST  )

జోగి రోహిత్ పిటిషన్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది...

జోగి రోహిత్ పిటిషన్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ ఇబ్రహీంపట్నం(Vijayawada Ibrahimpatnam)లో మాజీ మంత్రి జోగి రమేశ్(Former Minister Jogi Ramesh) ఇంటిపై టీడీపీ(Tdp) నేతలు దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే జోగి రమేశ్ కుమారుడు రోహిత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమ ఇంటిపై దాడి చేసిన నిందితులపై కఠినంగా చర్యలు తీసుకునేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. అలాగే తమ ఇంటి వద్ద భద్రత కల్పించాలని మరో అనుబంధ పిటిషన్‌ను దాఖలు చేశారు.

హైకోర్టులో విచారణ

అయితే ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. జోగి రమేశ్ నివాసంపై ఎలాంటి దాడులు జరిగినా పోలీసులదే బాధ్యత అంటూ ధర్మాసనం స్పష్టం చేసింది. అవాంచనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం తరపున న్యాయవాది కోర్టుకు వివరించారు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు.. జోగి రమేశ్ ఇంటికి భద్రత కల్పించాలని ఆదేశించింది.

జోగి రమేశ్ ఇంటిపై దాడి: 40 మందిపై కేసులు.. 11 మందికి బెయిల్

Next Story