Couple Dead: కాలువలోకి దూసుకెళ్లిన కారు.. దంపతులు మృతి

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-04-06 09:21:50  IST  )

పెళ్లికి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కారు కాలువలోకి దూసుకెళ్లడంతో దంపతులు మరణించారు.

Couple Dead: కాలువలోకి దూసుకెళ్లిన కారు.. దంపతులు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలం తాపేశ్వరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. మండపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తాపేశ్వరం శివారు పేకేటిపాకలు వద్ద ఒక కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు మృతి చెందారు. ప్రమాద సమయంలో భర్త బోగిల్లి వీరవెంకట సతీష్ (40) కారు డ్రైవ్ చేస్తుండగా.. భార్య బోగిల్లి కిరణ్మయి (36) ఆయన పక్కనే ఉంది. నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. కాకినాడలో బంధువుల పెళ్లికి వెళ్లి తిరిగి సొంతూరైన వెలగతోడు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. చెరువులో మునిగిన కారును క్రేన్ సహాయంతో బయటకు తీశారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించి.. బంధువులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

తీరని విషాదం: షార్ట్ ఫిలిం తీయబోయి ముగ్గురు యువకుల జలసమాధి!

Next Story