- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Borugadda Anil: హైకోర్టు స్ట్రాంగ్ వార్నింగ్.. ఎట్టకేలకు లొంగిపోయిన బోరుగడ్డ అనిల్
వైసీపీ నేత, రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ (Borugadda Anil)పై ఏపీ హైకోర్టు (Andhra Pradesh High Court) మంగళవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ నేత, రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ (Borugadda Anil)పై ఏపీ హైకోర్టు (Andhra Pradesh High Court) మంగళవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తనకు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్ (Interim Bail) పొడిగించాలని కోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం బెయిల్ పొడిగించేందుకు నిరాకరించింది. ముందస్తు బెయిల్ సమయం ముగిసినా లొంగిపోకపోవడంపై కోర్టు సీరియస్ అయింది. తక్షణమే కోర్టు ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఉదయం 6.30కి బోరుగడ్డ అనిల్ (Borugadda Anil) రాజమండ్రి సెంట్రల్ జైలు (Rajahmundry Central Jail) లో పోలీసు ఉన్నతాధికారుల ఎదుట లొంగిపోయాడు. అయితే, అనిల్ లొంగిపోయిన విషయాన్ని సెంట్రల్ జైలు అధికారులు కూడా ధృవీకరించారు.
కాగా, సీఎం చంద్రబాబు (CM Chandrababu)పై అనుచిత వ్యాఖ్యలు, బెదిరింపు కేసులో బోరుగడ్డ అనిల్ (Borugadda Anil)ను అరెస్ట్ చేసి జైలుకు తరలించిన విషయం తెలిసిందే. అయితే తన తల్లి పేరిట ఫేక్ మెడికల్ సర్టిఫికెట్లతో మధ్యంతర బెయిల్ తీసుకుని బయటకు వచ్చారు. బెయిల్ గడువు ముగిసినా కోర్టులో లొంగిపోలేదు. కోర్టును తప్పుపట్టించేందుకు ప్రయత్నం చేశారు. దీంతో ఆయనపై హైకోర్టు ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
Read More..
బోరుగడ్డ అనిల్‌పై హైకోర్టు సీరియస్.. లొంగిపోవాలని ఆదేశం
Arrest: ఎమ్మెల్యేకు న్యూడ్ వీడియో కాల్.. పోలీసుల అదుపులో నిందితులు






