బోరుగడ్డ అనిల్‌పై హైకోర్టు సీరియస్.. లొంగిపోవాలని ఆదేశం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-03-11 16:51:30  IST  )

బోరుగడ్డ అనిల్‌పై హైకోర్టు సీరియస్ అయింది..

బోరుగడ్డ అనిల్‌పై హైకోర్టు సీరియస్.. లొంగిపోవాలని ఆదేశం
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ నేత, రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్‌(Borugadda Anil)పై ఏపీ హైకోర్టు(Ap High Court) సీరియస్ అయింది. మధ్యంతర బెయిల్ పొడిగించాలని కోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం బెయిల్‌ పొడిగించేందుకు నిరాకరించింది. సమయం ముగిసినా లొంగిపోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే కోర్టులో లొంగిపోవాలని ఆదేశించింది.

కాగా చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, బెదిరింపు కేసులో బోరుగడ్డను అరెస్ట్ చేసి జైలుకు తరలించిన విషయం తెలిసిందే. అయితే తన తల్లి అనారోగ్యం కారణంగా మధ్యంతర బెయిల్ తీసుకుని బయటకు వచ్చారు. అయితే బెయిల్ గడువు ముగిసినా కోర్టులో లొంగిపోలేదు. అంతేకాదు కోర్టును తప్పుపట్టించేందుకు ప్రయత్నం చేశారు. దీంతో ఆయనపై తాజాగా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో బోరుగడ్డ అనిల్ రాజమండ్రి జైలులో లొంగిపోతాడా..?, లేదా కోర్టుకు వెళతారా అనేది చూడాల్సి ఉంది.

Next Story