- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభుత్వం ఇంకా కమ్మగానే ఉంది : బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కమ్మగానే ఉందని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కమ్మగానే ఉందని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం తిరుపతిలో నిర్వహించిన బీజేపీ కమల వికాసం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. కూటమి ప్రభుత్వంలో పదవుల కేటాయింపులపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించాయి. 1983లో ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో గజ్జల మల్లారెడ్డి .. ప్రభుత్వ పాలన కమ్మగా ఉందని చెప్పాడని గుర్తుచేశారు. ఇప్పుడు కూడా రాష్ట్రంలో పరిస్థితి అలానే ఉందని, కమ్మగా ఉంది అంటే అర్థం ఏంటో అందరికీ అర్థమయ్యే ఉంటుందన్నారు. ప్రభుత్వం కోసం గట్టిగా పనిచేసి కష్టపడేవారికి పదవులు దక్కాలని, కమ్మతో పాటు అన్ని కులాల వారికి సమాన న్యాయం చేయాలన్నారు. కూటమిలో బీజేపీ లేకపోతే రాష్ట్రంలో టీడీపీ, జనసేన లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాబట్టి కూటమిలో బీజేపీనే ప్రధానమని, ఆ తర్వాతే టీడీపీ, జనసేన వాళ్లుంటారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలకు అవకాశం ఇవ్వాలని కోరారు.
తిరుమల లడ్డూ కల్తీ అంశంపై కూడా ఆయన స్పందించారు. దొంగలు దొరికిపోయి జంతుకొవ్వు లేదని చెప్తున్నారని దుయ్యబట్టారు. జంతుకొవ్వు కంటే వైసీపీ వాళ్లకే కొవ్వెక్కువగా ఉందని, ముందు వాళ్ల కొవ్వును కరిగించాలని అప్పుడే కూటమి బాగుపడుతుందన్నారు.






