పవన్ కల్యాణ్ సినిమాపై కమ్యూనిస్టుల విమర్శలు.. బీజేపీ నేత కౌంటర్

by Gantepaka Srikanth |   (  Updated:2025-07-25 15:52:08  IST  )

పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Power Star Pawan Kalyan) ప్రధాన పాత్రలో నటించిన హరిహర వీరమల్లు చిత్రం

పవన్ కల్యాణ్ సినిమాపై కమ్యూనిస్టుల విమర్శలు.. బీజేపీ నేత కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Power Star Pawan Kalyan) ప్రధాన పాత్రలో నటించిన హరిహర వీరమల్లు చిత్రం(Harihara Veeramallu Movie) జులై 24వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో గ్రాండ్‌గా విడుదలైంది. మిక్స్‌డ్ టాక్‌తో థియేటర్లలో ప్రదర్శింపబడుతోంది. అయితే.. ఈ సినిమాలో ముస్లింలను విలన్లుగా చూపించారని.. చరిత్రను వక్రీకరించేలా పవన్ కల్యాణ్ సినిమా తీశారని కమ్యూనిస్టులతో సహా పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా వారి విమర్శలకు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి(Vishnuvardhan Reddy) స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ పెట్టారు. ‘హిందూ మతాన్ని, సాధువులను, ఆలయ సంప్రదాయాలను అపహాస్యం చేసేలా లెక్కలేనన్ని సినిమాలు ఉన్నాయి. అయినా ఇదివరకు ఎప్పుడూ ఆ సినిమాలపై నోరు మెదపని కమ్యూనిస్టులు పవన్ కల్యాణ్ సినిమా రాగానే బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇది పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో చేసే విమర్శలు. నిజంగా వారికి చిత్తశుద్ధి ఉంటే.. గతంలోనూ అనేక సినిమాలు వచ్చాయి.. వాటిపై ఎందుకు స్పందించలేదని మండిపడ్డారు. హరిహర వీరమల్లు చిత్రం అనేది ప్రచారం కాదు.. అది మన చరిత్ర. ప్రతీ ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాలి. ఔరంగజేబు హిందులను ఏ రకంగా హింసించారో అందరికీ తెలియాలి. దీనికి మతం రంగు పులమడం, రాజకీయం చేయడం సరికాదు’ అని విష్ణువర్దన్ రెడ్డి ఎక్స్‌లో పేర్కొన్నారు.

గుంటూరులో పవన్ కళ్యాణ్‌పై వైసీపీ ఫిర్యాదు

Next Story