- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుంటూరులో పవన్ కళ్యాణ్‌పై వైసీపీ ఫిర్యాదు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan)పై పోలీసులకు ఫిర్యాదు(Complaint) అందింది.

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan)పై పోలీసులకు ఫిర్యాదు(Complaint) అందింది. ఇటీవల పవన్ కళ్యాణ్ నటించిన "హరిహర వీరమల్లు"(HHVM) సినిమా సక్సెస్ మీట్ సందర్భంగా, దాడులు చేయాలని అభిమానులను రెచ్చగొట్టారని ఆరోపిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) నేతలు గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సినిమా సక్సెస్ మీట్‌లో పవన్ కళ్యాణ్ వైసీపీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసి, జనసేన కార్యకర్తలను దాడులకు ప్రేరేపించారని వైసీపీ నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా వ్యవహరించారని, అభిమానులను రెచ్చగొట్టి హింసాత్మక చర్యలకు ప్రోత్సహించారని వెల్లడించారు. తాడేపల్లి పోలీసులు ఈ ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
పవన్ కల్యాణ్ సినిమాపై కమ్యూనిస్టుల విమర్శలు.. బీజేపీ నేత కౌంటర్






