- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏసీబీ కోర్టులో చెవిరెడ్డి పిటిషన్లు.. విచారణ వాయిదా
లిక్కర్ కేసులో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెయిల్ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి...

దిశ, వెబ్ డెస్క్: లిక్కర్ కేసు(Liquor Case)లో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి(YSRCP leader Chevireddy Bhaskar Reddy) బెయిల్ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ కేసులో ఇప్పటికే ఆయన జైలులో ఉన్నారు. అయితే తనకు మధ్యంతర, లేదా రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని కోరుతున్నారు. ఇందులో భాగంగా ఏసీబీ కోర్టులో ఆయన తరపున బెయిల్ పిటిషన్లు(Bail Petitions) దాఖలు అయ్యాయి. ఈ బెయిల్ పిటిషన్లపై తాజాగా ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు .. మధ్యంతర బెయిల్‌పై రేపటికి, రెగ్యులర్ బెయిల్‌పై సెప్టెంబర్ 2కి విచారణ వాయిదా వేసింది.
కాగా గత ప్రభుత్వం రాష్ట్రంలో లిక్కర్ అమ్మకాలు చేపట్టింది. ఈ అమ్మకాల్లో అవకతవకలు జరిగినట్లు కూటమి ప్రభుత్వం గుర్తించారు. ఈ మేరకు సిట్ అధికారులతో విచారణ చేపట్టింది. దీంతో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డితో పాటు అప్పటి వైసీపీ నేతలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కేసిరెడ్డితో పాటు పలువురు అధికారులను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ప్రస్తుతం వీరంతా బెయిల్ కోరుతూ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై వాదనలు కొనసాగుతున్నాయి. తాజాగా చెవిరెడ్డి పిటిషన్లపై విచారణ వాయిదా పడింది.
Read More..
ధర్మస్థలంపై అసత్య ప్రచారం.. ED దర్యాప్తు చేయాలని అమిత్ షా కు లేఖ రాసిన ఉడిపి ఎంపీ






