మద్యం మత్తులో హోంగార్డ్‌పై దాడి.. జనసేన నేతపై కేసు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-08-25 13:47:06  IST  )

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జనసేన నేత కర్రి మహేశ్ వీరంగం సృష్టించారు. ...

మద్యం మత్తులో హోంగార్డ్‌పై దాడి.. జనసేన నేతపై కేసు
X

దిశ, వెబ్ డెస్క్: కృష్ణా జిల్లా మచిలీపట్నం(Machilipatnam)లో జనసేన నేత కర్రి మహేశ్(Janasena Leader Karri Mahesh) వీరంగం సృష్టించారు. మత్యం మత్తులో హోంగార్డుపై దాడి చేశారు. బైక్ వచ్చిన సమయంలో తనను చూసి హోంగార్డు లేవలేదనే కారణంతో ఆయన రెచ్చిపోయారు. బ్రహ్మణకాలనీలో హోంగార్డు మోహన రావు నైట్ బీట్‌లో ఉండగా కర్రి మహేశ్ దౌర్జన్యానికి పాల్పడ్డారు. హోంగార్డుపై విచాక్షణా రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో మోహనరావుకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించారు.

విషయం తెలుసుకున్న పోలీస్ ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. జనసేన నేత కర్రి మహేశ్‌ చర్యలకు ఆదేశించారు. హోంగార్డు మోహనరావు ఫిర్యాదుతో మహేశ్‌పై కేసు నమోదు చేశారు. అయితే హోంగార్డుపై దాడిని మచిలీపట్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖండించింది. జనసేన నేత కర్రి మహేశ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసింది. ఈ ఘటనపై స్థానిక జనసేన నేతల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.

Read More..

రిటైర్డ్ డీఎస్‌పీని కట్టేసి కొట్టిన భార్యాకొడుకులు.. వీడియో వైరల్

Next Story