- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జనసేన నేతతో ఎమ్మెల్యేపై ఆరోపణలు చేసిన మహిళ ఆడియో కాల్ లీక్
జనసేన ఎమ్మెల్యే శ్రీధర్ పై వీణ అనే మహిళ లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తనపై ఎమ్మెల్యే అత్యాచారం చేశాడని, ఐదుసార్లు అబార్షన్లు చేయించారని సంచలన ఆరోపణలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్: జనసేన ఎమ్మెల్యే శ్రీధర్ పై వీణ అనే మహిళ లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తనపై ఎమ్మెల్యే అత్యాచారం చేశాడని, ఐదుసార్లు అబార్షన్లు చేయించారని సంచలన ఆరోపణలు చేశారు. ఆయనకు సంబంధించిన కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా తాజాగా బాధిత మహిళ జనసేన నేత తాతంశెట్టి నాగేంద్ర మాట్లాడిన ఫోన్ కాల్ ఆడియో బయటకు వచ్చింది. ఆడియోలో.. ఇన్ స్టాగ్రామ్‌లో శుభాకాంక్షలు చెప్పినవారికి కూడా ఎమ్మెల్యే శ్రీధర్ గాలం వేసేవాడని తనకు ఫిర్యాదు అందిందని తాతంశెట్టి నాగేంద్ర అన్నారు. బెంగుళూరుకు చెందిన ఓ యువతి ఇన్ స్టాలో ఎమ్మెల్యేగా గెలిచినందుకు శుభాకాంక్షలు చెబితే ఆమెతో కూడా అలానే ప్రవర్తించాడని చెప్పారు. మరోవైపు వీణ మాట్లాడుతూ.. తాను డబ్బుల కోసమో దేనికోసమో అయితే ప్రెగ్నెన్సీని అడ్డం పెట్టుకుని డబ్బులు డిమాండ్ చేసేదాన్ని అని చెప్పారు. శ్రీధర్ తన వదినపై కూడా అసభ్యకర కామెంట్లు చేసేవాడని చెప్పింది. శ్రీధర్ గురించి అన్ని విషయాలు తనకు తెలుసు కాబట్టే తనకు బయపడతాడని చెప్పింది. ఎలా ప్రవర్తించినా తాను శ్రీధర్ తోనే ఉన్నానని తెలిపింది.






