ఎమ్మెల్యే అరవ శ్రీధర్.. నా మధ్య జరిగిందిదే: బాధితురాలు

by Vemula.Srinu Prasad |

ఎమ్మెల్యే అరవ శ్రీధర్..తన మధ్య జరిగిన విషయాన్ని మీడియాకు బాధితురాలు వివరించారు..

ఎమ్మెల్యే అరవ శ్రీధర్.. నా మధ్య జరిగిందిదే: బాధితురాలు
X

దిశ, వెబ్ డెస్క్: కడప జిల్లా రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌(Railway Kodur Jana Sena MLA Arava Sridhar) ఎపిసోడ్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. తనను ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లైంగికంగా వేధించారని ఆరోపణలు చేసిన బాధితురాలు అసలు జరిగిన విషయంతా తాజాగా తెలిపారు. ‘‘నేను, నా బాబు మాత్రమే ఉండటం ఆయనకు ఆసరాగా అయ్యింది. బలవంతపు రిలేషన్ షిప్ ఎందుకని ప్రశ్నిస్తే బెదిరించారు. గర్భం వస్తే తీయించుకోమని చెప్పారు.. ప్రెగ్నెన్సీ తీయించుకోనని చెప్పినందుకు ఒక రోజు రాత్రి మా ఇంటికి వచ్చి నన్ను కొట్టారు. ఆయనతో ఉండాలంటూ నన్ను చాలా సార్లు బెదిరించారు. నా భర్తకు విషయం తెలిసి మా బాబును తీసుకెళ్లాడు. ఎమ్మెల్యేకు టెలిగ్రామ్‌లో మెసేజ్ చేశా.. రెండు రోజులు మాట్లాడారు. ఆ తర్వాత న్యూడ్ ఫోటోలు పంపించమని అడిగారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యేనంటూ నన్ను బెదిరించారు. నీ ట్రాన్స్‌ఫర్, ప్రమోషన్ అన్నీ నా చేతిలోనే ఉంటాయని బెదిరించారు.. మా ఇంటికి వచ్చి నన్ను వాహనంలో తీసుకెళ్లారు.’’ అని తెలిపారు.

Next Story