- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గిద్దలూరులో దారుణం.. భార్య చేతిలో భర్త హతం
భార్యాభర్తల మధ్య అన్యోన్యత బదులు ద్వేషాలు చెలరేగడం విచారకరం.

దిశ, వెబ్ డెస్క్ : మార్కాపురం జిల్లా (Markapuram District) గిద్దలూరు మండలంలోని దంతరపల్లెలో (Dantarapalle) దారుణ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో గొడవకు దిగిన భర్తను భార్య (Wife Kills Husband) మట్టుబెట్టింది. ఈ ఘటనతో ఒక్కసారిగా స్థానికంగా కలకలం రేగింది. పోలీసుల వివరాల ప్రకారం సారమేకల హరి (53) దంతరపల్లె గ్రామంలో తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. తరచూ మద్యం సేవించి ఇంటికి వచ్చేవాడు. మద్యం మత్తులో భార్యతో గొడవపడేవాడు. ఇదే కోవలో అతను భార్య లక్ష్మీదేవితో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడం గొడవ కాస్త ముదిరింది. దంపతులు ఇద్దరి మధ్య పెనుగులాట మొదలైంది. సహనం కోల్పోయిన లక్ష్మీదేవి భర్తపై దాడికి తెగబడింది. కుమార్తెల సహకారంతో తీసుకొని భర్త హరిపై ప్రతిదాడి చేసింది. అంతటితో ఆగకుండా బలమైన వస్తువుతో భర్తను చితకబాదింది. దెబ్బలకు తాళలేక హరి ప్రాణాలను విడిచాడు. విషయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిసరాలను పరిశీలించారు. ప్రాథమిక ఆధారాలను సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read More..
మైనర్ బాలికను తొమ్మిదేళ్లు లోబర్చుకున్న వివాహితుడు.. చివరకు పరారీ!






