- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గల్ఫ్ దేశాల్లో తెలుగువారు.. APNRTS 24/7 హెల్ప్ లైన్ నంబర్లు ఇవే
గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న తెలుగువారి కోసం స్పెషల్ టోల్ ఫ్రీ నంబర్ ను ఏర్పాటు చేసినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.

దిశ, వెబ్‌డెస్క్: గల్ఫ్ దేశాలపై ఇరాన్ యుద్ధం నేపథ్యంలో.. ఆయా దేశాల్లో ఉన్న తెలుగు ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఏ సమయంలో ఏ మిస్సైల్ వచ్చి పడుతుందోనని భయాందోళన చెందుతున్నారు. సొంతూళ్లలో ఉన్నవారు తమవారు ఎలా ఉన్నారోనని దిగులు చెందుతున్నారు. ఈ నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న తెలుగువారిని క్షేమంగా తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో మాట్లాడినట్లు తెలిపారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగువారు ఆందోళన చెందవద్దని కోరారు. APNRTలో గల్ఫ్ కంట్రీస్ లో ఉన్నవారిలో లక్షకుపైగా తెలుగువారి రిజిస్టర్ అయ్యారని తెలిపారు. రిజిస్టర్ చేసుకోని వారు 5 నుంచి 7 లక్షల వరకూ ఉండవచ్చని అంచనా ఉందని చెప్పారు. వీరందరినీ సేఫ్ గా తీసుకువచ్చేందుకు గల్ఫ్ దేశాల అధికారులతో సంప్రదింపులు జరుగుతున్నట్లు తెలిపారు.
ఏపీ ఎన్నార్టీ కో-ఆర్డినేటర్ల ద్వారా ఆయా దేశాల్లో ఉన్న తెలుగువారి కోసం టెంపరరీ వసతి ఏర్పాట్లు చేశామని మంత్రి వెల్లడించారు. ఎవరికైనా ఇబ్బందులు ఉన్నా, సహాయం కావాలన్నా APNRTC హెల్ప్ లైన్ నంబర్ 0863-2340678కు కాల్ చేసి తెలియజేయాలని, లేదా వాట్సాప్ నంబర్ +91 8500027678 నంబర్ కు చేయాలని సూచించారు. [email protected]ను కూడా సంప్రదించవచ్చని మంత్రి కొండపల్లి తెలిపారు. ఎవరికైనా వీసా ఎక్స్పైర్ అయినా వెంటనే టోల్ ఫ్రీ నంబర్ కు ఇన్ ఫాం చేస్తే వెంటనే దానిని తాత్కాలిక ఎక్స్ టెన్షన్ చేయిస్తామన్నారు.






