ద్రోణి ప్రభావం.. నేడు రాష్ట్రంలో భారీ వర్షాలు

by velandi.Saikiran |   (  Updated:2026-05-07 06:37:24  IST  )

ద్రోణి ప్రభావంతో నేడు ఏపీలోని ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు ప‌డ‌న‌నున్న‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌లు జారీ చేసింది.

ద్రోణి ప్రభావం.. నేడు రాష్ట్రంలో భారీ వర్షాలు
X

దిశ‌, వెబ్ డెస్క్: ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు బిగ్ అల‌ర్ట్. ద్రోణి ప్రభావంతో నేడు ఏపీలోని ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు ప‌డ‌న‌నున్న‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది వాతావ‌ర‌ణ శాఖ.

అల్లూరి జిల్లా జికే వీధి మండలం, పోలవరం జిల్లా చింతూరు, గుర్తేడు మండలాల్లో(03) తీవ్ర వడగాల్పులు, అల్లూరి జిల్లా ముంచింగిపుట్టు, ఏలూరు జిల్లా వేలేరుపాడు, పోలవరం జిల్లా కూనవరం, వరరామచంద్రాపురం మండలాల్లో(04) వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. అయితే, వర్షం పడేటప్పుడు పొలాల్లో పని చేసే రైతులు, కూలీలు, పశు కాపరులు చెట్ల కింద నిలబడరాదని సూచ‌న‌లు చేసింది. ఎండ తీవ్రత, ఉక్కపోత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది వాతావ‌ర‌ణ శాఖ.

Weather Alert: దూసుకొస్తున్న ద్రోణి.. తెలంగాణకు భారీ వర్ష సూచన!

Next Story