Weather Alert: దూసుకొస్తున్న ద్రోణి.. తెలంగాణకు భారీ వర్ష సూచన!

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-07 06:36:37  IST  )

తెలుగు రాష్ట్రాల్లో రానున్న3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Weather Alert: దూసుకొస్తున్న ద్రోణి.. తెలంగాణకు భారీ వర్ష సూచన!
X

దిశ, వెబ్‌‌డెస్క్: ఎండలతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు భారత వాతావరణ శాఖ (India Meteorological Department) చల్లని కబురు చెప్పింది. కర్ణాటక (Karnataka) నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా ఒక ద్రోణి ఏర్పడిందని, దీని ప్రభావంతో రానున్న 3 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ముఖ్యంగా తెలంగాణలోని జోగులాంబ గద్వాల, ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ, మెదక్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో బలమైన ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

ఇక ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) విషయానికి వస్తే, కోస్తా తీర ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవవచ్చని వాతావరణ కేంద్రం పేర్కొంది. అదేవిధంగా రాయలసీమలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు సంభవించే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా రైతులు తమ పంటల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

ద్రోణి ప్రభావం.. నేడు రాష్ట్రంలో భారీ వర్షాలు

Next Story