- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లిక్కర్ కేసు నిందితుడు రాజ్ కసిరెడ్డికి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
ఏపీ లిక్కర్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న రాజ్ కసిరెడ్డి అస్వస్థతకు గురయ్యారు...

దిశ, వెబ్ డెస్క్: ఏపీ లిక్కర్ కేసు(Ap Liquor Case)లో రిమాండ్ ఖైదీగా ఉన్న రాజ్ కసిరెడ్డి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను విజయవాడ జీజీహెచ్(Vijayawada GGH)కు తరలించారు. అనంతరం రాజ్ కసిరెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించారు. స్వల్ప అనారోగ్యం వల్లే ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి. అనంతరం తిరిగి జైలుకు తరలించనున్నారు.
జగన్ ప్రభుత్వ హయాంలో...
కాగా జగన్(Jagan) ప్రభుత్వ హయాంలో లిక్కర్ అమ్మకాల్లో అవకతవకలు జరిగినట్లు కూటమి ప్రభుత్వం గుర్తించారు. ఈ మేరకు విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశించింది. అయితే విచారణ చేపట్టిన పోలీసులు లిక్కర్ కేసులో అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. ఈ మేరకు నిందితులను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఈ కేసులో ఏ1 నిందితుడిగా రాజ్ కసిరెడ్డిని గుర్తించి అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ప్రస్తుతం ఆయన జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. స్వల్ప అనారోగ్యంతో ఆయనను ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
READ MORE .....






