- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ మద్యం కేసు నిందితులకు సుప్రీంలో చుక్కెదురు
ట్రయల్ కోర్టులోనే తేలనున్న నిందితుల భవిష్యత్తు.

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ మద్యం స్కాం (AP Liquor Scam) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో కీలకమైన ముగ్గురు నిందితులకు సుప్రీం కోర్టులో (Supreme Court) చుక్కెదురైంది. కేసులో కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఎం కార్యాలయ కార్యదర్శి, విశ్రాంత ఐఏఎస్ అధికారి కె.ధనుంజయ రెడ్డి, మాజీ ఓఎస్డీ పి.కృష్ణమోహన్ రెడ్డి, భారతి సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పలకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
4 వారాల గడువు
రెగ్యులర్ బెయిల్ (Regular Bail) కోరుతూ నిందితుల తరపున న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. అయితే బెయిల్ మంజూరు చేసేందుకు సుప్రీంకోర్టు అంగీకరించలేదు. నిందితులు రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని స్పష్టం చేశారు. ట్రయల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు 4 వారాల గడువును ఇచ్చింది. అప్పటి వరకు వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని సూచిస్తూ మధ్యంతర రక్షణ కల్పించింది.
కేసు నేపథ్యం
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో (2019-2024) మద్యం సేకరణ, బ్రాండ్ల ఎంపిక, లైసెన్సింగ్ విధానంలో భారీ అక్రమాలు జరిగాయనే ఆరోపణలున్నాయి. దానివల్ల ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ. 3,500 కోట్ల మేర నష్టం వాటిల్లిందని సీఐడీ (CID) అభియోగాలు మోపింది. ఈ క్రమంలోనే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలను అధికారులు అరెస్ట్ చేశారు.
డిఫాల్ట్ బెయిల్
విచారణ సందర్భంగా ప్రభుత్వం తరపు న్యాయవాదులు కీలక అంశాలను కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ముగ్గురు నిందితులు ఇప్పటికే డిఫాల్ట్ బెయిల్ పై బయట ఉన్నారని సుప్రీంకోర్టుకు తెలిపారు. గతంలో ఏసీబీ కోర్టు వీరికి డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయగా ఏపీ హైకోర్టు ఆ బెయిల్‌ను రద్దు చేస్తూ సరెండర్ కావాలని ఆదేశించిందని పేర్కొన్నారు. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా ప్రస్తుతం సరెండర్ అవ్వకుండా అత్యున్నత న్యాయస్థానం వారికి వెసులుబాటు కల్పించింది.
READ MORE .....






