- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పందెం రాయుళ్లకు షాక్.. కోడిపందేలపై హైకోర్టు కీలక ఆదేశాలు
సంక్రాంతి వచ్చిందంటే.. ఆంధ్రప్రదేశ్ కోడిపందాలకు పెట్టింది పేరు. ఇక్కడి కోడిపందాల కోసం ఇతర రాష్ట్రాల నుంచి వేలమంది పర్యాటకులు వస్తారనడంలో ఆశ్చర్యం లేదు.

X
దిశ, వెబ్‌డెస్క్ : సంక్రాంతి వచ్చిందంటే.. ఆంధ్రప్రదేశ్ కోడిపందేలకు పెట్టింది పేరు. ఇక్కడి కోడిపందేల కోసం ఇతర రాష్ట్రాల నుంచి వేలమంది పర్యాటకులు వస్తారనడంలో ఆశ్చర్యం లేదు. అయితే తాజాగా ఏపీ హైకోర్టు రాష్ట్రంలో నిర్వహించే కోడిపందేలపై కీలక ఆదేశాలు జారీ చేసింది. జూదం, జంతు హింస నిరోధక చట్టాలను రాష్ట్ర వ్యాప్తంగా కఠినంగా అమలు చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. కోడిపందేలు నిర్వహించే బరులపై సమాచారం అందిన వెంటనే పోలీసులు చర్యలు తీసుకునేలా చూడాలని కలెక్టర్లు, జిల్లా ఎస్పీలకు ఆదేశాలు ఇచ్చింది. అవసరమైతే ఆయా ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించాలని సూచించింది. కోడిపందాలు, జూదంలో లభించిన సొమ్మును సీజ్ చేయాలని కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోలీసులు కోడిపందాల బరుల నిర్వహణపై దృష్టి సారించారు. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో జరిగే కోడిపందేలపై ఫోకస్ పెంచారు.
Read More..
టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ సమస్య...మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి కీలక ప్రకటన
Next Story






