టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ సమస్య...మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న‌

by velandi.Saikiran |

జాతీయ రహదారుల రీజనల్ ఆఫీసర్ ఆర్కే సింగ్ తో మాట్లాడారు మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి. సంక్రాంతి పండుగ నేపథ్యంలో టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూడాలని సూచనలు చేశార‌ట‌.

టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ సమస్య...మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న‌
X

దిశ‌, వెబ్ డెస్క్‌: నాలుగు రోజుల్లో సంక్రాంతి పండుగ. ఈ త‌రుణంలోనే హైద‌రాబాద్ నుంచి అంద‌రూ సొంతూళ్ల‌కు చేరుకుంటున్నారు. ముఖ్యంగా హైద‌రాబాద్ నుంచి ఏపీకి ఎక్కువ సంఖ్య‌లో ప్ర‌యాణికులు వెళుతున్నారు. ఈ త‌రుణంలోనే టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ సమస్య వ‌స్తోంది. అయితే, ఈ స‌మ‌స్యపై తాజాగా ఏపీ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి స్పందించారు. జాతీయ రహదారుల రీజనల్ ఆఫీసర్ ఆర్కే సింగ్ తో మాట్లాడారు మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి.

సంక్రాంతి పండుగ నేపథ్యంలో టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూడాలని సూచనలు చేశార‌ట‌. అవసరమైతే పోలీస్ యంత్రాంగం సహాయ, సహకారాలు తీసుకోవాలని వివ‌రించారు మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి. ఇక అటు సంక్రాంతిని అడ్డు పెట్టుకుని ప్రైవేట్ ట్రావెల్స్ భారీ దోపిడీ చేస్తున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. హైదరాబాద్ నుంచి ఎటు వెళ్లాలన్నా రూ.2 వేలకు పైమాటే అంటున్నారు. దీనిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్ర‌యాణికులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story