తెలంగాణతో జల పంచాయితీపై ఏపీ గవర్నర్ కీలక వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-01-26 10:57:40  IST  )

తెలంగాణతో జల పంచాయితీపై ఏపీ గవర్నర్ కీలక వ్యాఖ్యలు చేశారు...

తెలంగాణతో జల పంచాయితీపై ఏపీ గవర్నర్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ(Ap), తెలంగాణ(Telangana) మధ్య వాటర్ వార్(Water War) కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఏపీలో కడుతున్న బనకచర్ల(Banakacharla), పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టుల(Polavaram-Nallamala Sagar)పై తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) అభ్యంతరం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు(Supreme Court) సైతం వెళ్లింది. అయితే సముద్రంలో కలిసే నీటినే వినియోగించుకుంటామని, తెలంగాణకు చెందిన ఒక్క చుక్కను కూడా వాడుకోమని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. అయినా సరే తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం చేస్తోంది.

గవర్నర్ అబ్దుల్ నజీర్ కీలక వ్యాఖ్యలు

ఈ నేపథ్యంలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో నిర్వహంచిన తొలి గణతంత్ర వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ నల్లమలసాగర్ ద్వారా నదుల అనుసంధానం చేస్తామని గవర్నర్ వెల్లడించారు. పొరుగు, రాష్ట్రాలకు ఇబ్బంది లేకుండా సముద్రంలో కలిసే జలాల్లోనే మళ్లిస్తామని గవర్నర్ అబ్దుల్ నజీర్ స్పష్టం చేశారు. అంతేకాదు ఉగాది నాటికి మరో 5 లక్షల కుటుంబాలకు ఇళ్లు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వం రాజధాని ప్రాజెక్టును ఆపేసిందని, రోడ్లను నిర్లక్ష్యం చేసిందని గవర్నర్ అబ్దుల్ నజీర్ గుర్తు చేశారు.

READ MORE .....

రాష్ట్ర ప్రజలే ప్రగతికి నిజమైన శిల్పులు : గవర్నర్ అబ్దుల్ నజీర్

అమరావతిలో తొలిసారి గణతంత్ర దినోత్సవ వేడుకలు.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్

Next Story