రూ.2,540 కోట్లుతో అమరావతి అభివృద్ధి... ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-04-30 07:30:47  IST  )

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ భేటీ అయిన విషయం తెలిసిందే. అయితే పలు ప్రాజెక్టులకు మంత్రులు ఆమోదం తెలిపారు...

రూ.2,540 కోట్లుతో అమరావతి అభివృద్ధి... ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్(Cabinet) భేటీ అయిన విషయం తెలిసిందే. అయితే పలు ప్రాజెక్టులకు మంత్రులు(Ministers) ఆమోదం తెలిపారు. అమరావతి(Amaravati)లో మొత్తం రూ.2,540 కోట్లతో అభివృద్ది చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా రాష్ట్ర సచివాలయం గ్లాస్ క్లాడింగ్ పనులకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే అసెంబ్లీ పరిసరాల్లో సివిల్ వర్క్స్‌కు రూ.798 కోట్ల ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. ఉండవల్లి జోన్‌లో మౌలిక వసతులకు రూ. 580 కోట్ల ప్రణాళికకు ఆమోద ముద్ర వేశారు. కృష్ణానది ఫ్లడ్ ప్రొటెక్షన్ పనులకు సైతం మంత్రులు ఆమోదం చెప్పారు. ల్యాండ్ పూలింగ్ స్కీమ్ నిబంధనల్లో సవరణలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు బాధితుల గృహ యూనిట్ ఖర్చు పెంపునకు ఆమోదం తెలిపారు. ప్రస్తుతం కేబినెట్ భేటీ కొనసాగుతోంది. సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. అనంతరం మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

సీఎం అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ

Next Story