- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
FLASH : అంబటి రాంబాబుకు బిగ్ రిలీఫ్.. మరో కేసులో బెయిల్ మంజూరు
వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుకు మరో కేసులో బెయిల్ మంజూరైంది. గుంటూరు ప్రిన్సిపల్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ మాజీ మంత్రి, ఆ పార్టీ కీలక నేత అంబటి రాంబాబుకు భారీ ఊరట లభించింది. మరో కేసులో బెయిల్ మంజూరైంది. గుంటూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు బుధవారం 2023లో సత్తెనపల్లి సంక్రాంతి సంబరాల లక్కీ డ్రా కేసులో బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. ఈ కేసులో అంబటి రాంబాబును కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సత్తెనపల్లి పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ ను డిస్మిస్ చేసింది. సీఎం చంద్రబాబుపై దుర్భాషలాడిన కేసుతో పాటు.. ఆయనపై పలు కేసులు నమోదవ్వడంతో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు.
మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న సమయంలో పోలీసులపై బెదిరింపులకు పాల్పడ్డారంటూ పట్టాభిపురం పోలీసులు నమోదు చేసిన కేసులో ఈనెల 11న బెయిల్ మంజూరైంది. గుంటూరు ఎక్సైజ్ కోర్టు బెయిల్ ఇచ్చింది. ఆ తర్వాత సంక్రాంతి సంబరాల లక్కీ డ్రా కేసులో పీటీ వారెంట్ జారీ అవ్వడంతో ఆయన విడుదల ఆగిపోయింది.






